పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్ లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Update: 2024-08-06 15:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎక్స్‌ప్రెస్ హైవే మీదకి వెళ్ళి కిందకి దూకడానికి ప్రయత్నించాడు. కింద నుండి ఇదంతా గమనిస్తున్న స్థానికులు కొంతమంది అతన్ని వద్దని వారిస్తున్నప్పటికి అతను వినకుండా దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనికి మతిస్థిమితం లేకపోవచ్చని భావిస్తున్నామని, స్పృహలోకి వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


Similar News