మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా

మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాయిదా వేయాలని స్థానిక కలెక్టర్‌కు ఈసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-04-01 11:21 GMT
మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్/ మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాయిదా వేయాలని స్థానిక కలెక్టర్‌కు ఈసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, రేపు జరగాల్సిన కౌంటింగ్ వాయిదా పడగా.. జూన్ 2వ తేదీకి వాయిదా వేస్తూ మరో తేదీని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అధికారులు కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఫలితాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ గెలుపు ధీమాతో ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవినాయక్‌ కౌంటింగ్‌ సిబ్బందితో సమీక్షించారు. కౌంటింగ్‌ నిర్వహించే బాయ్స్‌ కాలేజ్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రమంలో వాయిదా పడటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News