కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలు..

బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు చేరారు.

Update: 2023-03-02 16:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు చేరారు. గురువారం ప్రగతిభవన్ లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. మౌలిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా విస్తరించాలని అందుకు తమ రాష్ట్రంలో తమ వంతుగా కృషి చేస్తామని మహారాష్ట్ర నాయకులు తెలిపారు. దేశంలో కిసాన్ సర్కార్ కోసం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వసంత్ రావ్ బోండె, కాంగ్రెస్ కు చెందిన మాజీ జనరల్ సెక్రటరీ విఠల్ నాయక్, కాంగ్రెస్ జడ్పీటీసీ సరిత వర్కడ్, కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన, ఎంఎన్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్ లాల్ పవన్ , నాందేడ్ జడ్పీ సభ్యుడు నందతాయ్ పవార్, శిర్షేనా, నాందేడ్ జిల్లా మాజీ అధ్యక్షుడు సునిత భబలికన్, ఎన్సీపీ మహిళా అఘాడీ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ యశోదతాయ్ కోలి, పర్హాన్ జనశక్తి పార్టీ తాలూకా మాజీ అధ్యక్షుడు దిలీప్ నాయక్, లహాన్ జడ్పీ సర్కిల్ అర్ధాపూర్ అరవింద్ దేశ్ ముఖ్, హిందూ యువ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ దేశ్ ముఖ్, బీజేపీ యువమోర్చా తాలూకా జనరల్ సెక్రటరీ వైభవ్ కాలే, నాందేడ్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ సభ్యుడు గణేష్ జాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహ్మద్ షోయిబ్ ఉన్నారు. త్వరలోనే మరికొంతమంది నేతలు చేరనున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News