ఎస్సైపై లైంగిక ఆరోపణలు.. ఎస్పీకి కానిస్టేబుల్‌ ఫిర్యాదు

జోగులాంబ గద్వాల జిల్లా లో గత అనేక రోజులుగా

Update: 2024-08-30 07:44 GMT

దిశ,‌గద్వాల ప్రతినిధి: సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారి పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపింది. ఇప్పటికే జిల్లాలో పలు పోలీస్ అధికారులు ఇల్లీగల్ దందాలో పరోక్ష సంబంధాలు ఉన్న వారిని ఇతర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నా పోలీస్ అధికారులపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులపై జిల్లా పోలీస్ యంత్రాంగం వేటు వేసింది. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీస్ అధికారులు ఇల్లీగల్ దందాలు కొనసాగించడంపై పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లాయి. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల పర్యటన లో పోలీసులు భద్రతా కల్పించడంలో విఫలం చెందారని ఉన్నతాధికారులు గద్వాల సీఐపై వేటు‌వేశారు.

అలంపూర్ సర్కిల్ పోలీస్ వడ్డేపల్లి మండలం లో గత మూడు రోజుల క్రితం ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడును సీఐ తొక్కేస్తాని అని చెప్పడం.. కానిస్టేబుల్ కూతురు కావడంతో బెదిరింపుల గురిచేయడంతో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.. ఇది మరువక ముందే.. తాజాగా జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ ఐ ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాహిత భర్త ఏపిలో కానిస్టేబుల్ గా పని‌చేస్తున్నట్లు సమాచారం. తన భార్యతో ఓ ఎస్ఐ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఇటీవల జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్ ఐ పై అక్రమ సంబంధం ఆరోపణలు రావడం ఇప్పుడు జిల్లా లో చర్చనీయాంశంగా మారింది. అలంపూర్ నియోజకవర్గంలో ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ ఐ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని సదరు కానిస్టేబుల్ ఆరోపించాడు.

వారిద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని భర్తకు తెలియడంతో పలుమార్లు వారించాడు. తన భార్య ప్రవర్తన లో ఎలాంటి మార్పు రాకపోవడంతో అలంపూర్ సీఐ కి ,ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఐ సమక్షంలో ఎస్సై, కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ జరిగినట్లు, సీఐ సమక్షంలో ఎస్సై పై కానిస్టేబుల్ బందువులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. సంఘటన జరిగినప్పటి నుండి ఎస్ఐ బాధితుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడిపై ఎస్ఐ అక్రమ కేసు పెట్టడంతో తనకు ప్రాణ హాని ఉందని తననను ఎస్ఐ నుంచి రక్షించాలని ఇటీవల బాధిత కానిస్టేబుల్ జిల్లా పోలీస్ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ఎస్సై పై వస్తున్న అక్రమ సంబంధం ఆరోపణలను జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు, గద్వాల డీఎస్పీ ని సంప్రదించగా ఎస్ ఐ పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. జిల్లా లో ఎస్ ఐ పై వచ్చిన అక్రమ సంబంధం ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.


Similar News