టీడీపీకీ రాజీనామా చేశా.. త్వరలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తా : సీతమ్మ
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశా, ఎమ్మెల్యే గా పోటిలో ఉంటా.. నియోజకవర్గం,పార్టి ఏది అన్నది పది రోజుల్లో క్లారిటీ ఇస్తా అని దేవరకద్ర మాజీఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీతమ్మ అన్నారు
దిశ, మక్తల్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశా, ఎమ్మెల్యే గా పోటిలో ఉంటా.. నియోజకవర్గం,పార్టి ఏది అన్నది పది రోజుల్లో క్లారిటీ ఇస్తా అని దేవరకద్ర మాజీఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీతమ్మ అన్నారు.
శుక్రవారం దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి 72వ పుట్టినరోజు వేడుకలో భాగంగా పడమటి ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.వారి ఆలయ సంప్రదాయంప్రకారం ఆలయదర్మ కర్త ప్రాణేషచారి శాల్వాతో సన్మానించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ లను పంపిణీ చేసి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్నదానం కార్యక్ర మాన్ని నిర్వహించారు.కే. దయాకర్ రెడ్డి కుటుంబ పరంగా రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకుల ఆదరణ ఉందని వారి నిర్ణయం మేరకు తమను నమ్ముకున్న వారి కోసం తప్పకుండా ఎమ్మెల్యే బరిలో ఉంటా అన్నారు.
ఏ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నారు అన్నదానికి సమాధానం దాటవేసి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే టికెట్ ఇవ్వ డానికి అన్ని రాజకీయ పార్టీలు తన ఇంటి దగ్గరికి వస్తున్నా రని రెండు నియోజకవర్గాల్లో ఏ నియోజక వర్గం అనేది కార్యకర్తలతొ చర్చించి వారి తుది నిర్ణయం తీసుకుంటాను అని విలేకర్లతో అన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అభివృద్ధితో తమకు రెండు నియోజకవర్గంల నాయకులు కార్యకర్తలు గౌరవిస్తున్నారని పదవి లేకున్నా పది సంవత్సరాలుగా తమ వెంట ఉంటున్నా వారికీ అండదండగా ఉంటున్నామని చేపట్టిన ప్రతి కార్యక్ర మాన్ని విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు నియోజకవర్గాలకు చెందిన మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.