అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం : ఎంపీ మల్లు రవి

రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేసి

Update: 2025-01-02 13:34 GMT

దిశ,వెల్దండ: రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్, సింగిల్ విండో సొసైటీ బ్యాంకులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పొల్యూషన్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్ లతో కలిసి ఎంపీ అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని, సాంకేతిక కారణాలతో కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రెండు లక్షల పైబడి రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేస్తామన్నారు.

అనంతరం ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి, పాఠశాలలో పలు సమస్యలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అన్నింటిలో కన్నా విద్య ఎంతో గొప్పదని అలాంటి విద్యను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని , విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ను అందించవచ్చునన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్ధులు బాగా చదివి తమ తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్తీక్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మోతిలాల్ నాయక్, భూపతి రెడ్డి, మట్ట వెంకట గౌడ్, సంజీవ్ కుమార్ యాదవ్, పర్వత్ రెడ్డి, కే శమల్ల కృష్ణ , ఎర్ర శీను ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు ఉన్నారు.


Similar News