useless Structures : నిరుపయోగంగా హంగులతో కూడిన నిర్మాణాలు

లక్షలాది రూపాయలు వేచించి..గత ప్రభుత్వ హయాంలో హంగులతో కూడిన నిర్మాణాలు..ఒకటి రెండు మినహా ఇస్తే మిగతావి నిరుపయోగంగా మారుతున్నాయి.

Update: 2024-11-03 11:58 GMT

దిశ,ఊట్కూర్ : లక్షలాది రూపాయలు వేచించి..గత ప్రభుత్వ హయాంలో హంగులతో కూడిన నిర్మాణాలు..ఒకటి రెండు మినహా ఇస్తే మిగతావి నిరుపయోగంగా మారుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలు,వైకుంఠధామాలు,ప్రకృతి వనాలు,క్రీడ ప్రాంగణాలు ఎంతో ఆర్భాటంగా నిర్మించి..మూలకి పడవేసిన మంచంలా మారాయి. రైతుల కొరకు రైతు వేదికలు, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే గౌరవమైన అంతిమ సంస్కారాల కొరకు వైకుంఠధామాలు,పల్లెలలో పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు ప్రకృతి వనాలు, గ్రామీణ యువతను క్రీడాలలో రాణించేందుకు అంటూ క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. గత ఎన్నికలలో ప్రభుత్వం మారడంతో వాటి పరిస్థితి అదోగతిగా మారింది. ప్రజలు వినియోగించుకోవడం లేదా..అధికారుల పర్యవక్షణ లోపమా..అని ఆరోపణలు వస్తున్నాయి.

నిర్లక్ష్యలకు తావిస్తున్నారు..

మనిషి బ్రతికి ఉన్నప్పుడే కాదు..మరణానంతరం వారికి గౌరవమైన అంతిమ సంస్కారాలు నిర్వహించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని వైకుంఠధామాలు నిర్మించారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ వినియోగంలోకి తీసుకురావడం లేదు..నూతన విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసి.. బోరులు వేసి మోటర్లు బిగించి నీటి సదుపాయం కల్పించారు. అధికారుల పర్యవేక్షణ సైతం లోపించిందని విమర్శిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు శారీరక మానసిక ఉల్లాసం కొరకు నిర్మిస్తున్నామని క్రీడా ప్రాంగణాలను ఎంతో ఆర్భాటంగా నిర్మించారు. గ్రామీణ యువతకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని.. ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు నేడు బోసిపోతున్నాయి. పల్లెలో పచ్చటి పైరులతో కళకళలాడుతుందనుకున్న ప్రకృతి వనాలు కొన్ని ప్రాంతాలలో అద్భుతంగా ఉండగా..మరికొన్ని ప్రాంతాలలో మొక్కలకన్న ఎక్కువగా పిచ్చి గడ్డి కనిపిస్తూ.. నిర్లక్ష్యానికి తావిస్తోంది. రైతులందరికీ ఒక వేదికను ఏర్పాటు చేసి తగిన సూచనలు ఇచ్చేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేశారు. దేశానికి వెన్నుముక అయినా రైతన్న ఓ అధికారి ముందు ఎండలో నిల్చోని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వవద్దని నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. రైతు వేదిక మినహాయిస్తే మిగతా వాటిలలో నిర్లక్ష్యం కనిపిస్తున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

బిల్లులు రాకున్నా తమ సొంత డబ్బును..

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటికి అనువైన స్థలాలను గుర్తించడం కొరకు గ్రామాలలో యుద్ధాలే జరిగాయి. గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు లేకపోవడం..దాతలు ముందుకు రాకపోవడం..కొన్నిచోట్ల సర్పంచ్ లపై దాడి చేసేందుకు పలువురు ప్రయత్నించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉన్న సర్పంచులు,ఎంపీటీసీలు సకాలంలో బిల్లులు రాకున్నా తమ సొంత డబ్బును చెల్లించి గ్రామాలలో అద్భుతమైన నిర్మాణాలను చేపట్టారని నేటికీ ప్రజలు చర్చించుకుంటున్నారు. లక్షలాది రూపాయలు వేచించి..ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వాటిని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు అధికారులు, రాజకీయ నాయకులు ప్రజలకు సూచనలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News