ఘటనకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలి : జడ్చర్ల ఎమ్మెల్యే

ఇటీవల బాలనగర్ మండల పరిధిలోని మోదంపల్లి శివాలయాన్ని గ్రామానికి

Update: 2024-11-20 07:19 GMT

దిశ, జడ్చర్ల : ఇటీవల బాలనగర్ మండల పరిధిలోని మోదంపల్లి శివాలయాన్ని గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ పవిత్రం చేసి విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి బాలానగర్ మండలంలోని మొదంపల్లి శివాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలోనీ దేవాలయాలపై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని ఈ సంఘటనకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా పకడ్బంది చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

ఇకపై ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం కలవకుండా ఆవేశాలకు పోకుండా శాంతియుతంగా ఆలోచించాలని కోరారు కాగా ఈ ఘటనకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులే కారణమని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. గత ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలోని దేవాలయానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని,గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.


Similar News