రోడ్డు కల్వర్టు లో పడ్డ స్కూల్ బస్సు

ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో సోమవారం ఉదయం స్కూల్ పిల్లలతో వెళ్తున్న బసు కల్వర్టు గుంతలో పడింది. దీంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైనట్లు స్థానికులు తెలిపారు.

Update: 2023-08-14 05:16 GMT
రోడ్డు కల్వర్టు లో పడ్డ స్కూల్ బస్సు
  • whatsapp icon

దిశ, ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో సోమవారం ఉదయం స్కూల్ పిల్లలతో వెళ్తున్న బసు కల్వర్టు గుంతలో పడింది. దీంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైనట్లు స్థానికులు తెలిపారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎమ్ఎస్ఎన్ ఎక్సలెంట్ గ్రామర్ హై స్కూల్‌కు చెందిన బస్సు అయ్యవారిపల్లి, సింగారం గ్రామాలకు చెందిన విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తుంది. అదే క్రమంలో రాయిచెడు గ్రామంలో బిటి రోడ్డు పై నిర్మిస్తున్న కల్వర్టు మరమ్మత్తుల వద్ద ఎదురుగా బైక్ రావడంతో బస్ డ్రైవర్ కాస్త పక్కకు మలుపడంతో బస్సు వెనుక టైర్ భాగం కల్వర్టు గోతిలో పడి శబ్దం రావడంతో పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కి పడి భయబ్రాంతులకు గురైనట్లు స్థానికులు, విద్యార్థులు తెలిపారు.

ఆ సమయంలో రెండు గ్రామాలకు చెందిన 26 మంది విద్యార్థులు బస్‌లో ఉన్నట్లు తెలిపారు. కొందరు విద్యార్థులకు సీట్లు గుద్దుకొని స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. రోడ్డు మార్చు 2022 సంవత్సరంలో పనులు చేసి ఇప్పటివరకు 29 నెలలు గడుస్తున్నా కల్వర్టు పనులు చేయడంలో కాంట్రాక్టర్, ఏఈ సందీప్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్వర్టు పనులు మొదలు పెట్టి గోతులు తీసి కనీసం ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు కూడా పెట్టకపోవడంతో కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైతే రాయిచెడు గ్రామానికి కొందరు వ్యక్తులు ఏఈని ప్రశ్నిస్తే అప్పుడు వంతుకు గంతేసినట్లు ఇరువైపుల ఒకే బోర్డును ఏర్పాటు చేసి కేవలం ఫొటోకు మాత్రమే పోజు ఇచ్చి సూచిక బోర్డులు పెట్టిన చూడమని వాట్సాప్‌కు ఫోటోలు పెట్టి మమ అనిపించుకున్నాడని తెలిపారు.

అనంతరం మరుసటి రోజు కల్వర్టు వద్దకు వచ్చి చేస్తే కేవలం ఒకే సైడ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అధికారికి ప్రజా వ్యవస్థ పై ఎంత మమకారం ఉందొ తెలుస్తుందన్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ప్రజలు,విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

గుంతలో పడి బస్సు వంగింది

విద్యార్థులతో వెళ్తున్న మా స్కూల్ బస్ కల్వర్టు గుంతలో పడి బస్సు వంగిపోయింది అందరం భయపడ్డాం కొందరు విద్యార్థులం సీట్లు పట్టుకున్నప్పుడు చేతులు అందులో పడి వడితిరిగి నొప్పిలేశాయి. వెంటనే బస్ దిగి భయంతో పరుగులు తీశాం. - సాయి కిరణ్ 4వ తరగతి విద్యార్థి

Tags:    

Similar News