అభివృద్ధి బాధ్యత మాది, గెలిపించే బాధ్యత మీది- మంత్రి నిరంజన్ రెడ్డి

అభివృద్ది చెసే బాధ్యత తీసుకున్న పార్టీకి పట్టం కట్టే బాధ్యత ప్రజల పై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

Update: 2023-10-09 09:47 GMT

దిశ,వనపర్తి : అభివృద్ది చెసే బాధ్యత తీసుకున్న పార్టీకి పట్టం కట్టే బాధ్యత ప్రజల పై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట లో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన 100 మంది నాయకులు,వనపర్తి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమార్ ,జిల్లా అధికార ప్రతినిధి బాబురావులు బీఆర్ఎస్ లో చేరారు.మంత్రి నిరంజన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అంతకుముందు బండారు నగర్ లో రూ.14 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం మంత్రి ప్రారంభించారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, గోపాల్ పేట, రేవల్లి మండలాల జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలను,86 మంది దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను మంత్రి నిరంజన్ రెడ్డి పంపిణి చేశారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు.రూ.4016 పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నే అన్నారు. తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఏకపక్ష తీర్పును ఇస్తే నేను సిఫాయిలా పనిచేస్తానన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే అర్హులు అయితే వారికి నేరుగా నగదు వారి ఖాతాలో జమ చేస్తున్నామన్నారు.50 రోజులు మండలం లోని ప్రతి గ్రామంలో పాత, కొత్త నాయకులు పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలని సూచించారు.

Tags:    

Similar News