హమ్మయ్యా.. గట్టెక్కిన నల్లమల ప్రజల కష్టాలు

నల్లమల అటవీ సరిహద్దులోని గ్రామాలైన ముక్కిడి గుండం, గెమ్యా తండా

Update: 2025-03-25 09:00 GMT
హమ్మయ్యా.. గట్టెక్కిన నల్లమల ప్రజల కష్టాలు
  • whatsapp icon

 దిశ,కొల్లాపూర్: నల్లమల అటవీ సరిహద్దులోని గ్రామాలైన ముక్కిడి గుండం, గెమ్యా తండా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. హమ్మయ్యా ఇన్నాళ్లకు ఎర్ర గట్టు పెద్ద వాగు పై హై లెవెల్ వంతెన పూర్తికావడంతో నల్లమల గ్రామాల ప్రజలు తబ్బిబయిపోయారు.వంతెన నిర్మాణం పూర్తి కావడం తో తమ కష్టాలు గట్టెక్కాయాయని నల్లమల అటవీ తీర ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామచందర్ యాదవ్,మాజీ సర్పంచ్ లు వేణుగోపాల్ యాదవ్, దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో హై లెవల్ వంతెన పై మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి కేటీఆర్,స్థానిక మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు.

ప్రతి వర్షాకాలంలో చుట్టూ ఉన్న వాగులు ఉండడంతో ముక్కిడి గుండం ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్ళారా చూసి చలించిపోయి ఎర్ర గట్టు పెద్ద వాగు పై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం నాటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హయాంలో రూ,9.60 కోట్లు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయించారు.వంతెన నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ 13వ తేదిన నాటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ఎంపీ రాములు, జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి బంగారయ్య,తో కలిసి నాటి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. నల్లమల అటవీ ప్రాంత ప్రజలు వరదల సమయంలో పెద్ద వాగు దగ్గర ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ,9.60 కోట్లు హర్షవర్ధన్ రెడ్డి మంజూరు చేయించారు. ప్రస్తుతం వంతెన పూర్తి కావడం తో వంతెన దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటీఆర్,మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్లెక్సీల కు సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు.

Similar News