Collector : మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి..

నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నూతన భవనాన్ని వైద్యవిద్యార్థుల తరగతుల నిర్వహణకు అన్నివిధాలా ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

Update: 2024-08-02 14:26 GMT

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నూతన భవనాన్ని వైద్యవిద్యార్థుల తరగతుల నిర్వహణకు అన్నివిధాలా ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఉయ్యాలవాడ సమీపంలో 25 ఎకరాల్లో 166 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న నూతన మెడికల్ కళాశాల భవనం మెడికల్‌ కళాశాల విద్యా ర్థుల (బాలబాలికలు) ప్రొఫెసర్ల వసతి గృహాలు భవన నిర్మాణ పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. నూతనంగా నిర్మితమౌతున్న మెడికల్‌ కళాశాల తరగతి గదుల భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మెడికల్‌ కళాశాలలో ప్రస్తుతం గత రెండు బ్యాచులకు చెందిన 300 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ తరగతులు ప్రస్తుతం భవనంలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరానికి మెడికల్ కళాశాలకు మరో 150 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని అన్నారు. దీని దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన మెడికల్‌ కళాశాల భవనం, హాస్టల్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీల్లో తరగతి గదులు, ల్యాబ్‌, ఆధునిక వసతులతో నిర్మించిన ప్రొఫెసర్‌ గదులు, కిచెన్‌, హాస్టల్‌ రూమ్స్‌, టాయిలెట్స్‌, వాటర్‌, పైపింగ్‌ సిస్టం, ఎలక్ర్టిసిటీని కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, చిట్ట చివరి దశ పనులు ఉన్నాయని అన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నూతన మెడికల్‌ కళాశాల భవనంలో 750 మంది విద్యార్థులు చదువుకునే విధంగా భవన నిర్మాణం, తరగతి గదుల నిర్మాణంతో చేపట్టినట్టు తెలిపారు. కళాశాలలో తరగతి గదులను నాన్ క్లినికల్ సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, సైన్సెస్ మ్యూజియం విభాగాలలో, క్లినికల్ విభాగంలో రేడియాలజీ, ల్యాబ్లు, కళాశాల లైబ్రరీని కలెక్టర్ పరిశీలించి వివరాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలో వైద్య విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు లైబ్రరీలో పుస్తకాల వినియోగం వసతి భోజనం ఏర్పాట్ల పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ప్రిన్సిపల్ తో సమావేశమై వైద్య కళాశాలలో కావాల్సిన వసతుల ఏర్పాట్లు వైద్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గౌసియా, అసిస్టెంట్ డైరెక్టర్ గౌస్, ఆర్ అండ్ బీ డీఈ రమాదేవి, దాస్ కన్స్ట్రక్షన్స్ టెక్నికల్ అసిస్టెంట్ వీరేష్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News