తూములకు లీకేజీలు…అలుగుకు గండ్లు

మండల పరిధిలోని కూచూరు చిన్న చెరువు నిండిన సంతోషం ఆయకట్టుదారుల్లో కొన్ని రోజులు కూడా నిలిచేలా కనిపించడం లేదు.

Update: 2024-09-07 13:28 GMT

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని కూచూరు చిన్న చెరువు నిండిన సంతోషం ఆయకట్టుదారుల్లో కొన్ని రోజులు కూడా నిలిచేలా కనిపించడం లేదు. గొలుసు కట్టు చెరువు కావడం వల్ల మండలంలో అన్ని చెరువులు నిండిన తర్వాత చివరగా ఈ చెరువుకు వరద నీరు వచ్చి చేరుతుంది. అలా వచ్చి చేరిన వరద నీటితో చెరువు నిండుకుండలా మారింది. అయితే చెరువు తూముకు భారీగా లీకేజీలు, అలుగుకు భారీగా గండ్లు పడడంతో చెరువులోకి వచ్చి చేరుతున్న వరద నీరు వృథాగా పోతుంది.

గతంలో ఈ విధంగా చెరువు అలుగుకు గండ్లు, తూముకు లీకేజీలు ఏర్పడిన సమయంలో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు జరిపి వదిలివేయడం వల్ల అవి మళ్లీ యథాతధంగా మారాయి. దీంతో చెరువులోకి వచ్చి చేరుతున్న వరద నీరు వృథా అవుతుండడంతో చెరువు ఆయకట్టు దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టి నీటిని వృథా కాకుండా చూడాలని కూచూరు, దొడ్డిపల్లి గ్రామాల ప్రజలు, చెరువు ఆయకట్టుదారులు కోరుతున్నారు.


Similar News