సారూ మీరు ఎక్కడ..? మా గేదెకు పానం బాలేదు..

పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు పశువైద్యశాలల్లో పశువైద్యాధికారి,సిబ్బంది అందుబాటులో లేక పశుపోషకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-10-25 10:47 GMT

దిశ,రేవల్లి: పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు పశువైద్యశాలల్లో పశువైద్యాధికారి,సిబ్బంది అందుబాటులో లేక పశుపోషకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాల్లో పశువులకు వైద్య సేవలు అందడం లేదు. పశువైద్యాధికారి,సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సేవలను అందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో పశువుల ఆసుపత్రిలో డాక్టర్ రాకపోవడంతో.. ఓ రైతు తన గేదతో గేటు ముందే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఎంత వేచి చూసిన డాక్టర్ రాకపోయేసరికి సారూ.. మీరు ఎక్కడ మా గేదకు పానం బాగాలేదు చూపించాలి అంటూ రైతు డాక్టర్ కోసం ఎదురు చూశాడని స్థానికులు తెలిపారు. చివరికి చేసేదేమిలేక ఏమీ లేక.. తన భార్యతో కలిసి గేదెను తోలుకొని ఇంటికి వెళ్ళాడు.దీంతో ఆ రైతు ఫోటో స్థానిక గ్రూపులలో వైరల్ గా మారింది. 


Similar News