నిండు కుండలా సంగంబండ రిజర్వాయర్.. గేట్లు ఎత్తే అవకాశం
నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గంట గంటకు వరద పెరగడంతో ఎప్పుడైనా షటర్లను ఎత్తే అవకాశం ఉందని ఇంజనీర్ అధికారులు అంటున్నారు.
దిశ, మక్తల్: నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. గంట గంటకు వరద పెరగడంతో ఎప్పుడైనా షటర్లను ఎత్తే అవకాశం ఉందని ఇంజనీర్ అధికారులు అంటున్నారు. పెద్దవాగుకు ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతో ఎప్పుడైనా రిజర్వాయర్ షటర్లను ఎత్తేందుకు ఇంజనీర్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా 0.5 టీఎంసీ నీరు చేరితే రిజర్వాయర్ గేట్లు ఎత్తాల్సిందేనని సంబంధిత ఇంజనీర్ మహమ్మద్ హమీద్ తెలిపారు. ప్రస్తుతం కృష్ణా నదికి వరద రావడంతో అధికారులు సంగంబండ రిజర్వాయర్ నింపుతున్నారు. ప్రస్తుతం దీని నిలుపుదల చేశారు. అయితే పెద్దవాగుపై నిర్మించిన సంగంబండల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక ప్రాంతం గుర్మత్కల్ ప్రాంతంలో కురుస్తున్న వర్షం వరద గా మారి నీరు పెద్దవాగు లోకి చేరుతుంది. దీంతో రిజర్వాయర్కు వరద వస్తుంది. సంగంబండ రిజర్వాయర్ 3.64 కెపాసిటీ ఉండగా. ప్రస్తుతం 3.62 ఉందని. ఇంకా ఆరు వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరితే సంగంబండ రిజర్వాయర్ షటర్లు ఎత్తాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే మక్తల్ నియోజకవర్గంలో వాగు పరివాహ ప్రాంతంలో ఉన్న రైతులు తమ మోటార్లను ఎగువ భాగం పెట్టుకోవాలని వరద వస్తున్నప్పుడు ఎవరు చేపల వేటకు వాగు దాటేందుకు ప్రయత్నిచోద్దని ఇంజనీర్ అధికారులు సూచించారు.