దిశ, అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో కాలనీలు కంపు కొడుతున్న, ప్రధాన రహదారి మాత్రం సుందరంగా తీర్చి దిద్దుతామని, ప్రజా ప్రతినిధులు ఆతృత్త తో చేపట్టిన డివైడర్ కట్టిన కొద్దిరోజులకే కూలిపోతుంది. అస్సలే ఇరుకుగా ఉన్న 30 ఫీట్ల వెడల్పు గల రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రోడ్డులో ఈ డివైడర్ నిర్మాణం ఎలాంటి ఉపయోగం లేదని, రోడ్డు విస్తరణ చేప్పట్టిన తర్వాత డివైడర్ నిర్మాణం చేసుంటే బాగుండేదని స్థానిక ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అయిన సందర్భాలు లేకపోలేదు. పట్టణంలోని ఆయా వార్డుల్లో కనీస వసతి, మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి
సమస్యలను పక్కన పెట్టిన పాలకులు, అవసరం లేకున్నా, సొంత లబ్ధి కోసం రూ.45 లక్షలు వెచ్చించి లైట్ వెయిట్ ఇటుకలతో చేపట్టారు. అయితే ఈ నిర్మాణం ఏ కొద్దిపాటి వర్షం వచ్చిన కూలిపోయేలా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు ప్రారంభోత్సవానికి రానున్న రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిలు నాణ్యత లేకుండా నిర్మించిన ఈ నిర్మాణాన్ని పూర్తిగా పరిశీలించి దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.