దిశ వార్తకు స్పందన..అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు సీజ్‌

ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలి అనే 'దిశ' కథనానికి అధికారులు స్పందించారు

Update: 2024-12-16 13:08 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలి అనే 'దిశ' కథనానికి అధికారులు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా పై స్పందించిన అధికారులు శుక్రవారం సాయంత్రమే ఇసుక డంపులను సీజ్ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోయిల్ కొండ మండలంలోని లింగల్చేడు,సూరారం,శేరి వెంకటాపూర్ వాగుల నుండి అనుమతులు లేకుండా ప్రతిరోజూ రాత్రి 9-30 నుండి 25 ,30 భారత్ బెంజ్ లారీ లతో యధేచ్చగా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.ఈ వార్త శుక్రవారం దిశ లో రావడంతో పై మూడు వాగుల వద్ద నిల్వ చేసిన లక్షలాది రూపాయల విలువచేసే ఇసుక డంపులను మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ సుజాత,కోయిల్ కొండ ఎస్ఐ భాస్కర్ రెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గౌరీశంకర్,బురానుద్ధీన్ తదితరులు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా దిశ లో వచ్చిన వార్త కు నారాయణపేట జిల్లా కలెక్టర్,ఎస్పీ లు స్పందించారు. ఇందుకు 'దిశ' కు దిడ్డి ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.


Similar News