ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-11-20 13:37 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు సావిత్రిబాయి ఫూలే చిత్ర పటాన్ని బహుకరించి సన్మానించారు. జిల్లాలో విద్యా శాఖ మరింత బలోపేతం కావడానికి కృషి చేయాలని,అందుకు తమ అసోసియేషన్ సహకారం అందిస్తుందని అన్నారు. డీఈవో మాట్లాడుతూ..ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు రెండు కూడా విద్యకు రెండు కళ్ళలాంటివేనని,రెండింటిలోని సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది బాలు యాదవ్,సూపరెంటెండెంట్ శంభు ప్రసాద్,దూకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News