మధ్యాహ్న భోజనం వికటించి 100 మందికి విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనం వికటించి వందమందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది.

Update: 2024-11-20 11:42 GMT

దిశ, మక్తల్/మాగనూరు : మధ్యాహ్న భోజనం వికటించి వందమందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. సాంబారు, గుడ్లతో మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. పలువురు విద్యార్థులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు, మరి కొంతమంది విద్యార్థులు తమ సెల్ ఫోన్లలో సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చిత్రించేందుకు ప్రయత్నించారు. కానీ స్థానిక విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించి ఫోన్లు లాక్కొని వైద్య వైద్య సేవలు అందిస్తామని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థుల పరిస్థితి విషమిస్తుండడంతో కొందరిని మక్తల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. కలుషిత ఆహారము తీసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.

 

 

 


Similar News