వసతి గృహా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
వరుసగా కురుస్తున్న వర్షాలకు వసతి గృహాలలో నివసించే విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: వరుసగా కురుస్తున్న వర్షాలకు వసతి గృహాలలో నివసించే విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బీసీ, ఎస్సీ వసతి గృహాల అధికారులు, వార్డెన్లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వసతి గృహాలలో పరిశుభ్రతకు పాటించి, ఎప్పటికప్పుడు శుభ్రపరచడం చేయాలన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు.
వసతి గృహాల్లో కొన్ని చోట్ల ఆహారానికి సంబంధించిన సూచిక లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వార్డెన్ లు వసతి గృహాలలో ఉండేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు అందించవలసిన స్కాలర్ షిప్ లను అందించే వాటిని ముందస్తుగానే ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. పాఠశాల అనంతరం విద్యార్థులకు వసతి గృహాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. వార్డెన్లు వారానికి రెండు సార్లు వసతి గృహాలను తనిఖీలు నిర్వహించాలన్నారు. విధుల పట్ల నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కృష్ణమ చారి, కన్యాకుమారి వసతి గృహాల వార్డెన్ లు పాల్గొన్నారు.