సమయపాలన పాలన పాటించని రెవెన్యూ అధికారులు.. 11 దాటిన వారి జాడే లేదు..

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించడం లేదు.

Update: 2023-02-15 06:33 GMT
సమయపాలన పాలన పాటించని రెవెన్యూ అధికారులు.. 11 దాటిన వారి జాడే లేదు..
  • whatsapp icon

దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించడం లేదు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఎదురుచూపులు తప్పడం లేదు. సంబంధిత అధికారులు 11 గంటల వరకు కూడా ఆఫీస్‌కు రాకపోవటంతో వేచి చూసి విసుకు చెందామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కార్యాలయంలో తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఉండగా.. బుధవారం కేవలం ఆర్ఐ రాజేశ్వర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.


ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News