MLA Vakiti Srihari : రాష్ట్రంలో కొనసాగుతున్న హైడ్రా మక్తల్‌లో అమలు
రాష్ట్రంలో అక్రమ భూ ఆక్రమణ కట్టడాలపై(హైడ్రా) రాష్ట్రంలో అన్ని
దిశ, మక్తల్: రాష్ట్రంలో అక్రమ భూ ఆక్రమణ కట్టడాలపై(హైడ్రా) రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు మక్తల్ లో కూడా అమలు చేస్తామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం రోజు మండల పరిషత్ కార్యాలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. గతంలో జరిగిన విషయాల గురించి చర్చించకుండా తను ఎమ్మెల్యేగా నెగ్గిన ఎనిమిది నెలల్లో జరిగిన జరగబోయే అభివృద్ధి పై ప్రతిపక్షాలు ఎవరైనా ఎక్కడికైనా చివరికి పట్టణంలోని నడిబొడ్డున ఉన్న నాటి శిలా దగ్గర కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అయితే రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నూతనంగా మక్తల్ లో ప్రారంభమయ్యే కోర్టు ప్రారంభించడానికి భవనాలు లేకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాని కోర్టు ప్రారంభించడానికి బిల్డింగ్ ల కొరత వల్ల ఎమ్మెల్యే క్యాంపు భవనాన్ని ఇవ్వడం జరిగింది.
విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు భూములను ఆక్రమించి వెంచర్లు చేసి అక్రమంగా భవనాలు నిర్మించారని దీనివల్ల వాతావరణ సమతుల్యత కోల్పోయి అకాలంగా కురిసిన వర్షాలకు ఇల్లు నీట మునిగి, ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు ఏర్పడకుండా అక్రమ కట్టడాలను హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి చేపట్టిన హైడ్రా ఆపరేషన్ కు ప్రతిపక్షాలు సైతం హర్షిస్తున్నాయని, చివరికి ముఖ్యమంత్రి సోదరిని భవనాలను సైతం కూల్చివేయడాన్ని ముఖ్యమంత్రి పేరు తెలంగాణలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. అమలవుతున్న హైడ్రా మక్తల్ లో పాటు నియోజకవర్గ పట్టణాల్లో కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నారని భూ అక్రమాలను స్వాధీనం చేసుకుంటే ప్రస్తుతం మక్తల్ లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించుకోవడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.