పీహెచ్‌డీ పట్టా అందుకున్న మక్తల్ ఉపధ్యాయురాలు

మక్తల్ పట్టణ స్థిర నివాసి కృష్ణవేణి టీచర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి శుక్రవారం ప్రొఫెసర్ల చేతుల మీద పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. మహబూబ్ నగరు జిల్లా జానపద

Update: 2023-02-10 09:13 GMT

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణ స్థిర నివాసి కృష్ణవేణి టీచర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి శుక్రవారం ప్రొఫెసర్ల చేతుల మీద పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. మహబూబ్ నగరు జిల్లా జానపద విజ్ఞానంలో "మాలకులం" అంశంపై విశ్రాంతి ఆచార్యులు,ప్రొఫెసర్.డాక్టర్. బూర్గుల కేశవులు పర్యవేక్షణలో మహబూబ్ నగరు జిల్లా జానపద విజ్ఞానంలో "మాలకులం" అనే అంశంపై పరిశోధన చేయగా ఉస్మానియా విశ్వవిద్యాలయం,ఆర్ట్స్ కళాశాల పరిధిలో పాఠ్య ప్రణాళిక సంఘం తెలుగు శాఖ విభాగంలో పరిశోధన చేయగా ప్రొఫెసర్లు క్రిష్ణవేణి కి పి.హెచ్.డి.పట్టా ప్రధానం చేశారు.

గతంలో తెలుగు విశ్వవిద్యాలయంలోని జానపద కళలు విభాగం నుండి మాల దాసర్ల కథాగానం ఒక పరిశీలన అనే అంశం పై మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(యం.ఫిల్)పట్టా పొందారు. రెండుసార్లు పట్టా పొందిన క్రిష్ణవేణీ మక్తల్ బాలికల ఉన్నత పాఠశాల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు.దీనితో తోటి పాఠశాల టీచర్లు మక్తల్ మండల వివిధ ఉపధ్యాయ సంఘాల వారు హర్షం వెలిబుచ్చారు.

Tags:    

Similar News