మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భారీ మెజారిటీ ఖాయం : బీఆర్ఎస్ నాయకులు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని హన్వాడ మండల బీఆర్ఏస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Update: 2023-11-01 14:27 GMT

దిశ, హన్వాడ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని హన్వాడ మండల బీఆర్ఏస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రోజు మండలంలోని హన్వాడ, పెద్దదర్పల్లి, ఇబ్రహీం బాద్, కొనగట్టుపల్లి, మాదారం, మునిమోక్షం, గొండ్యాల్ , వేపూర్, షేక్ పల్లి, టంకర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ గ్రామ అభివృద్ధి కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనులను వివరించారు.

పేద ప్రజల కోసం రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుపరచనున్నారని తెలిపారు. కొన్ని పార్టీలు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, మహిళలు వృద్దులు రైతుల మద్దతు కేసీఆర్ కే ఉందన్నారు. భారీ మెజారిటీతో ముచ్చటగా మూడవ సారి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలవడం ఖాయం అని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News