భారీ వర్షాలకు తెగిన లెఫ్ట్ లోయస్ట్ కెనాల్

రాత్రి కురిసిన భారీ వర్షాలకు సంగం బండ లోయెస్ట్ లెఫ్ట్ కెనాల్ మక్తల్

Update: 2024-08-20 12:58 GMT

దిశ, మక్తల్: రాత్రి కురిసిన భారీ వర్షాలకు సంగం బండ లోయెస్ట్ లెఫ్ట్ కెనాల్ మక్తల్ మండల పరిధిలోని దాసరిపల్లి గ్రామ శివారులో కొట్టుకుపోయింది. ముందు జాగ్రత్తగా చర్యగా ఆ కాల్వకు వదిలిన నీటిని నిలుపుదల చేశారు. సంగంబండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభమైన లెఫ్ట్ లోయస్ట్ కెనాల్ కాల్వలో దాదాపు 150 ఫీట్ల బండ అడ్డు రావడంతో కాలువ పనులు నిలిపి వేశారు. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు నెలల కిందట కాలువలో అడ్డంగా ఉన్న బండను తొలగించారు. గ్రావిటీ గా కాల్వను శాస్త్రీయపరంగా మూడు లేయర్లుగా పనులు చేయాల్సి ఉండగా, కక్కుర్తి తో జేసీపీతో తవ్వుకుంటూ వెళ్లారు. ఇలా చేయడం వల్ల రాత్రి కురిసిన వర్షాలకు పైనుండి వచ్చే వరద నీటిని తట్టుకోలేక కాలువ కొట్టుక పోతుంది అని సంబంధిత ప్రాజెక్ట్ ఇంజనీర్ తెలిపారు. గ్రావిటి కాల్వను సిద్ధం చేయాలంటే మూడు లేయర్లను మట్టి వేస్తు రోలర్ తిప్పుతూ కాల్వని సిద్ధం చేయాల్సి ఉంటుందని సంబంధిత ఇంజనీర్ నాగ శివ తెలిపారు.


Similar News