కుక్కలు, పందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై రామన్ గౌడ్
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటతోపాటు... Latest News
దిశ, వీపనగండ్ల: పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటతోపాటు కుక్కలు, పందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రామన్ గౌడ్ వారికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ సెంటర్ వద్ద కుక్కలు ఉండటం, వాటి ప్రక్కనుంచే అంగన్వాడీ చిన్నారులు వెళుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో అంగన్వాడీ టీచర్ కు, ఆయాకు ఇటీవల హైదరాబాద్ లో కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన సంఘటన గురించి వివరించారు. పాఠశాల అంగన్వాడీ సెంటర్ల పరిసరాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నం కోసం కుక్కలు, పందులు వంటి రావడం జరుగుతుందని, అనుకోకుండా విద్యార్థులపై, చిన్నారులపై దాడులు చేసే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠశాల పరిసర ప్రాంతాలలోకి కుక్కలు, పందుల దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.