ఉద్యోగులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితులు తెలంగాణలో లేవని, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని... Kishan reddy hits out at CM KCR

Update: 2023-03-08 12:59 GMT

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితులు తెలంగాణలో లేవని, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమేళ్ళనంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. తమ సమస్యలను శాసన మండల్లో వినిపించని వ్యక్తికి ఓటు ఎందుకు వేయ్యాలని ఆయన ప్రశ్నించారు. గతంలో మారుమూల ప్రాంతాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయుల సమస్యల గురించి పట్టించుకునేవారే లేకపోయారని, తమకంటూ ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఉపాధ్యాయుల తరఫున పెద్దల సభకు ఒకరిని ఎన్నుకునేవారని, కానీ నేడు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమ గళాన్ని వినిపించలేని వ్యక్తులకు ఎందుకు ఓటు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

నెలనెలా జీతం సమయానికి వస్తుందో లేదో అని ఆత్రుతతో ఎదురుచూసే దిశగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల దీనస్థితికి చేరిందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మద్దతుతో నిలబడిన ఏబీఎన్ రెడ్డికి మద్దతు పలికి, ఉపాధ్యాయ సమస్యలపై శాసనమండలిలో గళం వినిపించే వ్యక్తిగా ఎన్నుకుంటుందనే ఉపాధ్యాయ సమాజం పునుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ ఈ ఎన్నికలు మీ ఒక్కరి సమస్య పరిష్కారానికి కాదని, మన పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు తీసుకునే నిర్ణయం తెలంగాణ సమాజానికి మేలు కోరే విధంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి పి చంద్రశేఖర్, రాష్ట్ర కోశాధ్యక్షుడు శాంతి కుమార్, ఎగ్గని నర్సింహులు, సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు అశ్వద్ధామ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News