నగ్న ఫొటోలు బయట పెడతానని భయపెట్టి అత్యాచారం

స్నానం చేస్తుండగా వివాహిత ఫోటోలు తీసి,పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన మండల పరిధిలోని మరికల్ గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-12-31 15:23 GMT

దిశ,నవాబుపేట : స్నానం చేస్తుండగా వివాహిత ఫోటోలు తీసి,పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన మండల పరిధిలోని మరికల్ గ్రామంలో చోటు చేసుకుంది. మహిళ  జీవితంతో చెలగాటమాడిన ముసరిగళ్ళ నర్సింలు అనే ప్రబుద్ధుడిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..తనకు శారీరకంగా లొంగితేనే తాను తీసిన ఫోటోలను తన ఫోన్ లో నుంచి తొలగిస్తానని, లేకుంటే వాటిని వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తానని ఆమెను భయబ్రాంతులకు గురిచేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. తన శారీరకవాంఛ తీర్చుకుని,ఆ తర్వాత తను ఆమెతో గడిపిన ఫోటోలను తన కొడుకు ఆనంద్ తో కలిసి ఆమె భర్తకు నర్సింలు చూపగా..ఆ ఫోటోలను చూసి అసహ్యించుకున్న భర్త ఆమెను 9 నెలల క్రితం పుట్టింటికి పంపించేశాడు. నర్సింహులు చేసిన నిర్వాహకం కారణంగా తన భర్తకు,పిల్లలకు దూరమైన ఆమె తన తల్లిగారింటి వద్ద కుమిలిపోతూ జీవనం గడుపుతుంది. ఇటీవల మళ్లీ నర్సింలు ఆమె తల్లిగారింటికి వెళ్లి ఆ ఫోటోలు చూపి తనతో సంబంధం కొనసాగిస్తేనే వాటిని తన ఫోన్ లో నుండి తొలగిస్తానని లేకుంటే వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తానని చెప్పి మళ్లీ బెదిరిస్తుండడంతో..అతడి చేష్టలకు విసిగి మహిళ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జీవితంతో చెలగాటమాడుతున్న నర్సింలుపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.విక్రమ్ తెలిపారు.


Similar News