ఎంపీగా గెలిపించండి.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా.. : వంశీచంద్ రెడ్డి
మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యావని, ఎంపీగా గెలిస్తే పాలమూరు మరింత అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిఅన్నారు.
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యావని, ఎంపీగా గెలిస్తే పాలమూరు మరింత అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం ఉదయం నియోజకవర్గం పరిధిలోని ఎక్లాస్ పూర్, కన్మనూరు గ్రామాల్లో కార్నర్ మీటింగ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఈ ప్రాంతంలో నీటి వనరులు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు ఉన్నా కేసీఆర్, మోడీలు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు హామీలలో నాలుగు హామీలను అమలుపరుస్తున్నామని, నారాయణపేట, మక్తల్, కొడంగల్ తాగు తాగునీరు అందించే పనులకు శంకుస్థాపన చేసి చేసి తమది చేతల ప్రభుత్వమని నిరూపించామని తెలిపారు. ఆగస్టు 15 తారీకు లోపల తమ ప్రభుత్వం రుణమాఫీని చేసి తీరుతుందని అందుకు రాజీనామా చేయడానికి బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉండాలని అన్నారు.