బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్ చేయాల్సి వస్తుంది

విధులకు హాజరయ్యే సిబ్బంది బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్ చేయాల్సి వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను హెచ్చరించారు.

Update: 2024-03-27 12:04 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: విధులకు హాజరయ్యే సిబ్బంది బయోమెట్రిక్ లేకపోతే జీతం కట్ చేయాల్సి వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను హెచ్చరించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఏ సిబ్బంది ఏ పని నిర్వహిస్తున్నారో.. ఫీల్డ్‌లో ఏమి చేశారు ఎన్ని ఇల్లు విజిట్ చేశారని అడిగి తెలుసుకున్నారు. లెప్రసి కేసులెన్ని వచ్చాయని మార్చిలో ఏ పని చేశారన్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన దరఖాస్తులను పర్యవేక్షించి క్లియర్ చేయాలన్నారు. విధులకు మూడు రోజులు ఆలస్యమైనచో జీతం కట్ చేస్తారని కలెక్టర్ తెలిపారు.


Similar News