వర్షం కారణంగా కూలిన ఇల్లు.. తృటిలో తప్పిన ప్రమాదం
మండల పరిధిలోని బొందల పల్లి గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కేశ టాకయ్య అనే వ్యక్తికి సంబంధించిన మట్టి మిద్దె శుక్రవారం రాత్రి కూలిపోయింది.
దిశ, నాగర్ కర్నూల్: మండల పరిధిలోని బొందల పల్లి గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కేశ టాకయ్య అనే వ్యక్తికి సంబంధించిన మట్టి మిద్దె శుక్రవారం రాత్రి కూలిపోయింది. టాకయ్యతో పాటు ఆయన భార్య లింగమ్మ వారి కుమారుడు తో కలిసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటి పరిస్థితి అనుమానంగా ఉండడంతో భోజనం చేసుకొని టాకయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. వెళ్ళిన కొద్దిసేపటికి ఇల్లు కూలిపోయింది. కొంత ఆలస్యం అయినా తమ ప్రాణాలకు ముప్పు ఉండేదని టాకయ్య తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ రాములు, ఎం మాధవ రెడ్డి, కట్టే బాలయ్య, దండు బాలయ్య, బండారు అమృత సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి.. విషయాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇల్లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న టాకయ్య కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి హామీ ఇచ్చారు.