జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం బహుకరణ.. ఎన్ని కేజీలు ఉందో తెలుసా..?
అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి ఆదివారం ఉగాది పండుగ రోజు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం భారీ బంగారు కిరీటం సమర్పించారు.
దిశ, అలంపూర్ టౌన్: అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి ఆదివారం ఉగాది పండుగ రోజు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం భారీ బంగారు కిరీటం సమర్పించారు. బంగారు కిరీటంతో వచ్చిన భక్తులకు ఆలయ ఈఓ పురేందర్ ,చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని కిరీటాన్ని ఈవోకు అందజేశారు. అలాగే అర్చకులు అమ్మవారికి కిరీటాన్ని అలంకరించారు. 1 కేజీ 587 గ్రాములు బంగారు కిరీటం విలువ రూ. 1 కోటి 60 లక్షల 10 వేల 500 రూపాయలు ఉన్నట్టు ఈవో పురేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ. పురేందర్ కుమార్, ఛైర్మెన్ బి. నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలు జగదీశ్వర్ గౌడ్, పులెందర్, గోపాల్, జి. వెంకటేశ్వర్లు, విశ్వనాథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.