నారాయణపేట మార్కెట్ యార్డు ఎదుట రైతుల ఆందోళన

నిన్న మొన్నటి వరకు కనీసం మద్దతు ధరతో కందులు

Update: 2024-12-17 07:14 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నిన్న మొన్నటి వరకు కనీసం మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసిన వ్యాపారస్తులు సిండికేట్ వ్యాపారానికి తెరలేపారు. ఏకంగా ఒకేరోజు క్వింటాలుకు రూ. 2500 తగ్గించడంపై రైతన్నలు పేట మార్కెట్ యార్డు ముందు రైతన్నలు మంగళవారం ఆందోళన చేపట్టారు. సుమారు 200 కి పైగా రైతులు హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ముందు రోజు రైతులు... వ్యాపారస్తులకు మధ్య చర్చలు జరగ్గా విఫలమయ్యాయి. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకొని కూర్చున్నారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. అన్నం పెట్టే రైతుల బాగోగులు చూడని ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని ఆరోపించారు. రైతుల ఆందోళన తో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.


Similar News