ఊరుంది..కానీ పేరేది?

మండల కేంద్రంగా పిలువబడే అడ్డాకులకు జాతీయ రహదారికి

Update: 2025-02-14 08:09 GMT
ఊరుంది..కానీ పేరేది?
  • whatsapp icon

 దిశ,అడ్డాకుల : మండల కేంద్రంగా పిలువబడే అడ్డాకులకు జాతీయ రహదారికి ఇరువైపులా ఊరు పేరు గల సూచిక గ్రీన్ బోర్డు లేకపోవడం గమనార్హం. గ్రామానికి సంబంధించిన జాతీయ రహదారిపై ఇరువైపులా ఆఫ్ కిలోమీటర్ దూరంలో తప్పనిసరిగా ఎల్ అండ్ టి వారు సూచిక గ్రీన్ రేడియం స్టిక్కర్ తో బోర్డును రహదారి పక్కన తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అడ్డాకుల మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు ఉన్నందున బోర్డు ను ఏర్పాటు చేయాల్సిన ఎల్ అండ్ టి వారు మొదటి నుంచి బోర్డును ఏర్పాటు చేయడం మరిచారు.మండల కేంద్రం ఉన్నందున చాలామంది దూర ప్రాంతాల నుంచి అవసర నిమిత్తం అడ్డాకుల కు వస్తుంటారు. అడ్డాకుల వచ్చిందో రాలేదో తెలియక వాహనదారులు బ్రిడ్జి పై నుంచి వెళ్ళిపోయి ఊరు దాటామని తెలిశాక మళ్లీ యూటర్న్ చేసుకొని వస్తున్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంగా పిలవబడే అడ్డాకులకు రేడియం గ్రీన్ బోర్డును రహదారికి ఇరువైపులా ఎల్ అండ్ టీ వారు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Similar News