బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : డీఎస్పీ లింగయ్య

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి

Update: 2025-01-02 12:40 GMT

దిశ, నారాయణపేట క్రైమ్ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ ఎన్ లింగయ్య అన్నారు. 2025 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించబడుతున్న ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నారాయణపేట జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కలిసికట్టుగా పనిచేసి బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐ లు మురళీ, సునీత, డీఈవో గోవిందరాజులు,CWC సభ్యులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News