బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్..

నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 లలో ఉద్యోగ అవకాశాలను పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని శుక్రవారం బీజేవైఎం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు ధన్వాడ మండల బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డితో పాటు నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.

Update: 2024-07-05 14:21 GMT

దిశ, ధన్వాడ / మరికల్ : నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 లలో ఉద్యోగ అవకాశాలను పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని శుక్రవారం బీజేవైఎం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు ధన్వాడ మండల బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డితో పాటు నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి అవలంబిస్తుందని, నిరుద్యోగుల సమస్యల కొరకు పోరాటం చేస్తున్న మమ్మల్ని ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా తెలంగాణ నిరుద్యోగులకు అండగా బీజేవైఎం పోరాట ఉద్యమం చేస్తూనే ఉంటుందని అన్నారు. అరెస్టు చేసిన వారిలో విష్ణువర్ధన్ రెడ్డి, చరణ్ దాస్, చక్రవర్ధన్, రవికుమార్ గౌడ్, హరీష్ కుమార్, ఆకాష్, బాలరాజ్ వున్నారు.


Similar News