MLA Anirudh Reddy : అవినీతి అంతమే నా పంతం
అవినీతి అంతమే తన పంతమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి( MLA Anirudh Reddy )MLA Anirudh ReddyMLA Anirudh Reddyఅన్నారు.
దిశ,నవాబుపేట:అవినీతి అంతమే తన పంతమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి( MLA Anirudh Reddy )MLA Anirudh ReddyMLA Anirudh Reddyఅన్నారు.మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని,అందుకు సంబంధించి విచారణ జరుగుతుందని విచారణలో అవినీతికి పాల్పడినట్లు తేలిన అధికారులను ఊరికే వదులబోనని,వారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు విషయంలో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన వెంటనే తాను విచారణకు ఆదేశించానని,విచారణ పూర్తి అయిన వెంటనే అవినీతికి పాల్పడిన అధికారిని జైలుకు పంపుతానని ఆయన తెలిపారు. ఈ విషయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు అవినీతికి పాల్పడలేదని, అందువల్ల వారు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు అయ్యాయని అందులో రూ.25 నుండి రూ.30 కోట్లు నవాబుపేట మండలంలో రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. మండలంలోని గిరిజన తండాలకు బిటి రోడ్లు నిర్మించి.. గిరిజనులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని ఆయన అన్నారు. మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో 133 కెవి సబ్ స్టేషన్ మంజూరి కోసం కృషి చేయడం జరుగుతుందని, ఆ సబ్ స్టేషన్ ఏర్పాటు అయితే రాబోయే 20 సంవత్సరాలు మండలంలో విద్యుత్ సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. జడ్చర్ల నియోజక వర్గానికి మంజూరైన మినిస్టేడియం స్థలాభావం వల్ల జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేయడానికి వీలుకాని పక్షంలో నవాబుపేట మండల కేంద్రంలో దానిని ఏర్పాటు చేసి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మండల పరిధిలోని తూక్య తండాలో ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణపు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొల్లూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.