కర్ణాటక స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
కర్ణాటక రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ బోర్డు డైరెక్టర్ గౌరమ్మ నడగౌడర్ ను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ధార్వాడ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
దిశ, కొల్లాపూర్: కర్ణాటక రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ బోర్డు డైరెక్టర్ గౌరమ్మ నడగౌడర్ ను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ధార్వాడ పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఏడాది జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు కోసం కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా గౌరమ్మ నడగౌడర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, ఎండి ఖాదర్ బాషా,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఇక్బాల్ బాషా,సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, రత్నగిరి పౌడేషన్ కన్వీనర్ కేతూరి ధర్మ తేజ,కొల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బింగి మహేష్ యాదవ్,పసుల వెంకటేష్ కలిశారు.