త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయండి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

వనపర్తి జిల్లా కేంద్రంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ గుత్తేదారులను, అధికారులను ఆదేశించారు.

Update: 2023-04-06 10:17 GMT
త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయండి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
  • whatsapp icon

దిశ, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ గుత్తేదారులను, అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నిర్మాణ పనులను, రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశిత గడువు లోపు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోనీ చాణక్య పాఠశాల, కొత్తకోట మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, సెల్ ఫోన్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను హాల్ లోకి అనుమతించ వద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ డీఈలు అశోక్, దానయ్య, మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్, జడ్పీ సీఈవో శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News