భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను పరిశీలించిన కలెక్టర్
భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. మంగళవారం గట్టు మండలంలోని తప్పెట్లమొరుసు, ఆరగిద్ద గ్రామంలో భారత్ మాల నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణతో కలిసి పరిశీలించారు.
దిశ, గద్వాల కలెక్టరేట్ : భారత్ మాల రోడ్డు నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పరిశీలించారు. మంగళవారం గట్టు మండలంలోని తప్పెట్లమొరుసు, ఆరగిద్ద గ్రామంలో భారత్ మాల నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే అథారిటీ అధికారులతో రహదారి నిర్మాణం సంబంధిత భూముల వివరాలను, భారత్ మాల రహదారి మ్యాపింగ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా రైతుల భూములకు సర్వీస్ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన కనెక్టివిటీ అందిస్తామని అన్నారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరిత రాణి, ఎన్ హెచ్ ఎ ఐ ఇంజనీర్ సురేందర్, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.