Collector Adarsh Surabhi : దోమలు వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
వర్షాకాలంలో నిలువ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రై డే
దిశ,మదనాపురం: వర్షాకాలంలో నిలువ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డ్రై డే కార్యక్రమం సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు పారిశుధ్య కార్యక్రమాలు, వివిధ గ్రామాల్లో వచ్చిన ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు.మండలంలో గోపన్ పేట ప్రాథమిక సబ్ సెంటర్, నర్సింగాపురం, మదనాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,గ్రామపంచాయతీల్లో పర్యటించారు,జ్వరం వచ్చిన ప్రాంతంలో పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయించి పాజిటివ్ వచ్చిన ఇంట్లో పేరత్ర్యన్ మందు పిచికారి చేయించాలని సూచించారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పని చేసి మరిన్ని పాజిటివ్ కేసులు కాకుండా చూసుకోవాలని ఆదేశించారు
గోపన్ పేట ప్రాథమిక సబ్ సెంటర్ లో మొక్కను నాటిన కలెక్టర్ అవుట్ పేషంట్ రిజిస్టరు, మందుల నిల్వ రిజిస్టర్ ను పరిశీలించారు మదనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష చేయించుకున్న జిల్లా కలెక్టర్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఈ మధ్యకాలంలో వచ్చిన అవుట్ పేషంట్లు, అందులో జ్వరంతో వచ్చిన వారు ఎంతమంది, ఎంతమందికి రక్త నమూనాలు సేకరించారు వాటిలో పాజిటివ్ కేసులు ఎన్ని అని ప్రశ్నించారు. బర్త్ ప్లాన్ ఈ.డి.డి రిజిస్టరు ను పరిశీలించారు. రక్త పరీక్షలు సరిగ్గా చేస్తున్నారా లేదా అని పరిశీలించడానికి కలెక్టర్ స్వయంగా రక్త నమూనా ఇచ్చి డెంగ్యూ, సి.బి.పి. పరీక్షలు చేయమని ల్యాబ్ టెక్నీషియన్ కు ఇచ్చారు. రక్త పరీక్ష నిర్వహించిన విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ నుండి ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. ప్రవళిక, కొత్తకోట ప్రత్యేక అధికారి స్వరణ్ సింగ్, మండల ప్రత్యేక అధికారి మల్లికార్జున్,, తహశీల్దార్లు అబ్రహం లింకన్, ఎంపీడీఓ ప్రసన్న కుమారి ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.