క్రైస్తవులకు ఎల్లవేళలా అండగా ఉంటా

శాంతి సేవ పరంగా క్రైస్తవులు ఎల్లవేళలా ముందు ఉంటారని ఎమ్మెల్యే బేకరీ శ్రీహరి అన్నారు.

Update: 2024-12-25 13:11 GMT

దిశ, మక్తల్: శాంతి సేవ పరంగా క్రైస్తవులకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే బేకరీ శ్రీహరి అన్నారు. బుధవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని చర్చింలో పాల్గొని కేకు కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా రోగులకు అనాధలకు విద్యా, వైద్యం సేవలందించడంలో క్రైస్తవ మిషనరీలు ముందుంటారని, పేద క్రైస్తవులకు ప్రభుత్వపరంగా వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తామన్నారు. ఇల్లు లేనివారి వివరాలను చర్చి పాస్టర్ ద్వారా తీసుకుని లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Similar News