బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం

పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు.

Update: 2023-03-05 09:16 GMT
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం
  • whatsapp icon

దిశ, అలంపూర్: పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు  దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. ఆదివారం మానవపాడు మండల పరిధిలోని మద్దూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామంలో పలు కాలనీలను పరిశీలించి నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఇంటింటికీ తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, మహమ్మద్, ఉప సర్పంచ్ వలి, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్, గొల్ల వెంకట్రాముడు, మల్లికార్జున్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News