వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకమండలి ప్రమాణ స్వీకారం వాయిదా
మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలక మండలి ప్రమాణస్వీకారం వాయిదా పడింది.
దిశ, మక్తల్: మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలక మండలి ప్రమాణస్వీకారం వాయిదా పడింది. విశ్వాసనీయ సమాచారం మేరకు..25 తారీఖు బుధవారం రోజు జరగాల్సిన వ్యవసాయ మార్కెట్ పాలకమండలి ప్రమాణ స్వీకారం కొన్ని అనుకోని సంఘటనలతో వాయిద వేశారు. ఈనెల 20వ తేదీన మంచి థితి,నక్షత్రం, ముహూర్తం ఉన్నందున కార్యాలయంలో గోమాత పూజ నిర్వహించిన పాలకమండలి..ప్రమాణ స్వీకారాన్ని 25వ రోజు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొత్త సంవత్సరం జనవరి నెల మూడో తేదిన పాలకమండలి ప్రమాణస్వీకారొత్సవ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవుతున్న ట్టుగా పార్టీలోనే ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.