ఉధృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె..
తమ డిమాండ్ల సాధనకై సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: తమ డిమాండ్ల సాధనకై సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతంగా సాగిస్తూ గురువారం 24 వ రోజుకు చేరుకున్నది.తమను గుర్తించి విద్యా శాఖలో విలీనం చేస్తూ,క్రమబద్ధీకరించాలని,ప్రతి ఉద్యోగికి 20 లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తూ భద్రత కల్పించాలని,పదవీ విరమణ ప్రయోజనాల క్రింద 20 లక్షలు చెల్లించాలనే తదితర డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు టీటీడీ కళ్యాణ మంటపం ధర్నా చౌక్ నుండి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లి పూలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాసులు,కార్యదర్శి యాదగిరి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాజామైనోద్ధీన్,తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.