మారుమూల గ్రామవాసికి డాక్టరేట్
గద్వాల నియోజకవర్గానికి చెందిన వాగుబాయి తిమ్మప్పకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డి)ని ప్రదానం చేశారు.
దిశ, గద్వాల ప్రతినిధి : గద్వాల నియోజకవర్గానికి చెందిన వాగుబాయి తిమ్మప్పకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డి)ని ప్రదానం చేశారు. భారతదేశంలో స్వాతంత్య్రానంతర భూసంస్కరణలు...తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సూచనలతో కూడిన అధ్యయనంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన ప్రొఫెసర్ వై.విష్ణుప్రియ పర్యవేక్షణలో జరిగిందని తిమ్మప్ప తెలిపారు.
విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని విద్యార్థి సమస్య లపై రాజీలేని పోరాటం చేశామని, తెలంగాణ ఉద్యమంలో క్యాంపస్ కేంద్రం నుంచి పని చేశానని ఆయన తెలిపారు. మారుమూల గ్రామం నుండి విద్యాభ్యాసం కొనసాగించి నేడు డాక్టరేట్ సాధించడం పై గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.