గణనాథుడికి 110 కిలోల భారీ లడ్డూ…

జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో 110 కేజీల లడ్డూను ఏర్పాటు చేశారు.

Update: 2024-09-07 11:56 GMT

దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో 110 కేజీల లడ్డూను ఏర్పాటు చేశారు. బాలాపూర్ లడ్డూ మాదిరి కొత్తగా ఉండే విధంగా లడ్డును ఏర్పాటు చేసినట్లు ఆ గ్రామ యువకులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు కుంభేశ్వరుని ఆలయం దగ్గర 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కే ఎస్ ఎస్ యూత్ సభ్యులు 110 కిలోల లడ్డూను వినాయకుని ముందు ఏర్పాటు చేశారు. లడ్డూను వేలం వేయకుండా చివరి రోజు సాయంత్రం నిమజ్జనం సందర్భంగా ప్రతి ఇంటికి ఉచితంగా అందించాలని ఉద్దేశంతో ఈ లడ్డూను ఏర్పాటు చేసినట్లు యువకులు తెలిపారు. భక్తి భావనతో ప్రతి ఇంటికి ప్రసాదం అందించడానికి యూత్ చేస్తున్న కృషిని గ్రామ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బాలాపూర్ లడ్డూ మాదిరి ప్రతి ఏడాది లడ్డూ సైజు ను పెంచుకుంటూ వెళ్తామన్నారు.


Similar News