బిగ్ ట్విస్ట్.. కొత్త బీర్ బ్రాండ్ కంపెనీ లైసెన్స్ రద్దు చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల మద్యం తయారీ కంపెనీ సోమ్ డిస్టలరీస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. ఈ కంపెనీకి రాష్ట్రంలో

Update: 2024-06-19 17:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల మద్యం తయారీ కంపెనీ సోమ్ డిస్టలరీస్ హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. ఈ కంపెనీకి రాష్ట్రంలో మద్యం తయారు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పర్మిషన్ ఇవ్వడమే. తెలంగాణలో మద్యం తయారీకి సోమ్ డిస్టలరీస్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విరుకుచుకుపడింది. ఇతర రాష్ట్రాల్లో కూడా మద్యం తయారీ చేస్తోన్న సోమ్ డిస్టలరీస్‌ ఉత్పత్తులు తాగడం వలన చాలా మంది చనిపోయారని.. అలాంటి కంపెనీకి తెలంగాణలో ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించింది.

రేవంత్ రెడ్డి సర్కార్ ఆదాయం కోసం తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాలమాడుతోందని.. వెంటనే సోమ్ డిస్టలరీస్‌కు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో మద్యం తయారీకి రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చిన సోమ్ డిస్టలరీస్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సోమ్ డిస్టిలరీస్ సంస్థ లైసెన్స్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. కల్తీ మద్యం ఆరోపణలతో పాటు ఆ కంపెనీల్లో చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్నారని సీరియస్ అయిన మోహన్ యాదవ్ సర్కార్.. తాజాగా సోమ్ డిస్టలరీస్ ట్రేడ్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేసింది.

దీంతో ఇకపై మధ్యప్రదేశ్‌లో సోమ్ డిస్టలరీస్‌కు చెందిన మద్యం బ్రాండ్‌లు కనుమరుగు కానున్నాయి. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్‌లో అధికారులు రాష్ట్రంలోని వివిధ మద్యం తయారీ కంపెనీలపై రైడ్స్ చేశారు. అధికారుల తనిఖీల్లోల కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలు బాలకార్మికులతో పని చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ కంపెనీలను సీజ్ చేశారు. ఇందులో భాగంగానే సోమ్ డిస్టలరీస్ లైసెన్స్ సైతం రద్దు అయ్యింది. 


Similar News