హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఠాల డ్రగ్స్ అమ్మకాలు
డ్రగ్స్ దందా చేసే వారు తెలివి మీరిపోయారు. వారి ఆచూకీ దొరకకుండా ఉండేందుకు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేస్తు దందాను విస్తరిస్తున్నారు.
దిశ, క్రైమ్ బ్యూరో: డ్రగ్స్ దందా చేసే వారు తెలివి మీరిపోయారు. వారి ఆచూకీ దొరకకుండా ఉండేందుకు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేస్తు దందాను విస్తరిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు సోమవారం రాజస్థాన్ నుంచి ఇదే తరహాలో ఇంటర్నెట్ కాల్స్ ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్ మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ఓం ప్రకాష్ అలియాస్ ఓం రాం కార్పంటర్ పని చేస్తున్నాడు. అతని స్నేహితుడు సన్వాలా రాం రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి రెయిలింగ్ పని చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ ఆదాయం సరిపోక పోవడం తో ఈ ఇద్దరు పాపి ప్ట్రా మత్తు మందు, ఎండిఎంఏ డ్రగ్స్‌ను తీసుకువచ్చి వాటిని హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయించి డబ్బు సంపాదిద్దామని స్కెచ్ వేశారు.
దీని కోసం ఓం ప్రకాశ్ మధ్యప్రదేశ్‌కు చెందిన వికాస్ నుంచి 40 కేజీల పాపి స్ట్రా మత్తు మంది, ఎండీఎంఏ డ్రగ్స్ ను కొనుగోలు చేసి వాటిని సన్వాల్ రాం కు ఇచ్చేందుకు వస్తున్నట్లు తెలుసుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఈ ఇద్దర్నీ జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో పట్టుకున్నారు. విచారణలో వీరి వద్ద నుంచి 40 కేజీల పాపిస్ట్రా మత్తు మందు, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో ఓం ప్రకాష్ తన ఆచూకీ దొరకుండా, ఫోన్ నెంబరును పోలీసులు గుర్తించకుండా వై-ఫై ద్వారా ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ చేస్తు వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ఉపయోంగించి వైఫై రూటర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి మత్తు పదార్థాలు సరఫరా చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన వికాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఈ ఇద్దరు నగరానికి భారీ మొత్తంలో పాపి స్ట్రా మత్తు మందును తీసుకువచ్చారని తెలిసింది. 10 నుంచి 20 వేల రూపాయాలకు కేజీ పాపిస్ట్రాను కొనుగోలు చేసి నగరంలో దాన్ని కేజీ లక్ష రూపాయాలకు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
Read More..