బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలహీనపడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Update: 2025-04-13 02:51 GMT
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (low pressure) ఈ రోజు బలహీనపడింది. దీంతో తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు (Rains in the districts) పడుతున్నాయి. గత రెండు వారాలుగా.. వేసవి కావడంతో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా నమోదవుతున్న ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చెప్పిన ఈ చల్లని కబురుతో ప్రజలకు భారీ ఉపశమనం కలుగచేసింది. వాతావరణ శాఖ అలర్ట్ (Meteorological department alert) ప్రకారం.. ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇందులో భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, జోగులాంబ గద్వాల జిల్లా లో వర్షాలు కురవనున్నాయి.

మండుతున్న ఎండలు ఆరెంజ్ అలర్ట్ జారీ

ఓ వైపు అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉండగా మరికొన్ని జిల్లాల్లో భారీ ఎండలు దంచికొట్టిన ఉన్నట్లు అధికారులు (Officers) ప్రకటించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజు పలు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యే అవకాశం ఉంది. అధికారులు అలర్ట్ ప్రకారం.. జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, నిజామాబాద్, మంచిర్యాల వంటి జిల్లకు ఎండలు దంచి కొట్టనున్నాయి. దీంతో వాతావరణ శాఖ పైన తెలిపిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తున్నారు.

Similar News